ముఖ్యమంత్రి జగన్‌పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి పేర్ని నాని ఖండించారు. పవన్‌కు పెళ్లిళ్ల మీద మక్కువుంటే.. జగన్‌కు ప్రజాసేవ మీద మక్కువ ఉందన్నారు. పవన్‌పై సీఎం జగన్ వ్యక్తిగత విమర్శలు ఎప్పుడూ చేయలేదన్నారు. వెంకయ్యనాయుడు గురించి గతంలో చేసిన విమర్శలు పవన్ గుర్తుకు తెచ్చుకోవాలని హితవు పలికారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని బెజవాడ బందర్ రోడ్డులో గానీ.. బీచ్ సెంటర్ రోడ్డులో కొట్టుకుందాం రమ్మని పవన్ కల్యాణ్ పిలిచారు. మీరు సినిమాల్లో గబ్బర్‌సింగ్... రాజకీయాల్లో రబ్బర్ సింగ్.
-పేర్ని నాని, మంత్రి
రాష్ట్రంలో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టాలని పాదయాత్ర సమయంలో జగన్‌ను ఎంతో మంది యువత కోరారని మంత్రి పేర్నినాని గుర్తు చేశారు. వేలాది మంది యువత, తల్లిదండ్రుల కోరిక మేరకే ఆంగ్లమాధ్యమం ప్రవేశ పెడుతున్నామని వివరణ ఇచ్చారు. పూర్తిగా తెలుగు మాధ్యమం చదువుల వల్ల పైచదువుల్లో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. దశలవారీగా ఆంగ్లమాధ్యమం అమలు చేస్తామని పేర్ని నాని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
''నేను చేసుకున్న పెళ్లిళ్లతోనే జగన్ రెండేళ్లు జైలుకెళ్లారా..?''