ఏ మాధ్యమం చదువుకోవాలో ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థులకే ఇవ్వాలని జనసేన నేత లక్ష్మీనారాయణ అన్నారు. తెలుగుభాషా పరిరక్షణకై "మాతృభాషా మాధ్యమ ఐక్యకార్యాచరణ సమితి" ఏర్పడింది. సమితి అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణని నియమిస్తున్నట్లు సభ్యులు ప్రకటించారు. అనంతరం సమితి కార్యాచరణ కరపత్రాన్ని లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ప్రాథమిక విద్య... మాతృభాషలో ఉంటేనే విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. ఇదే విషయాన్ని ప్రపంచంలోని అనేక పరిశోధనలు తెలిపాయని వివరించారు. మాతృభాషలో విద్యాభ్యాసం ద్వారానే భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా తయారు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. దశల వారీగా ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు.
ఇదీ చదవండి :