భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ అప్రమత్తమైంది. ప్రధాన జలాశయాలకు... ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నీటి నిర్వహణపై దృష్టి పెట్టింది. విజయవాడలో ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సమీక్షించారు. వరద, వర్షాల ప్రభావంపై చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం అన్ని జిల్లాల నీటిపారుదల శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి...