ETV Bharat / city

విజయవాడలో ఉత్సాహంగా కారు రేస్ ఛాంపియన్​ షిప్​ - నేషనల్ ఆటో క్రాస్ కారు రేస్ వార్తలు

కృష్ణా జిల్లా  ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం దగ్గర జాతీయ ఆటోక్రాస్ ఛాంపియన్​షిప్ ఫైనల్స్ ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ పోటీలను పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. పర్యటక రంగం అభివృద్ధి దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే పోటీల్లో 23 రాష్ట్రాలకు చెందిన 140 మంది రేసర్లు పాల్గోనున్నారని నిర్వాహకులు చెప్పారు.

Indian national auto cross firals at vijayawada
జాతీయ ఆటోక్రాస్ ఛాంపియన్​షిప్ పోటీలు ప్రారంభించిన మంత్రి అవంతి శ్రీనివాస్
author img

By

Published : Jan 11, 2020, 8:48 PM IST

జాతీయ ఆటోక్రాస్ ఛాంపియన్​షిప్ పోటీలు ప్రారంభించిన మంత్రి అవంతి శ్రీనివాస్

పర్యటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పవిత్ర సంగమం సమీపంలో జాతీయ ఆటోక్రాస్ ఛాంపియన్​షిప్ ఫైనల్ పోటీలను మంత్రి ప్రారంభించారు. 23 రాష్ట్రాలకు చెందిన దాదాపు 140 మంది రేసర్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. క్వాలిఫైయర్ రేసులు ఉత్తరభారతంలో జరగ్గా... ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఫైనల్ మ్యాచ్​లను ఏపీలో నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 1.8 కిలోమీటర్ల రేస్ ట్రాక్​లో కార్లు దుమ్మురేపుతూ దూసుకెళ్లడం చూపురులను ఆకట్టుకుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో ఫైనల్ విజేతలను ఆదివారం సాయంత్రం ప్రకటించనున్నారు. ఛాంపియన్ యాచ్ క్లబ్ ఆధ్వర్యంలో పలు జాతీయ స్థాయి రేసులు నిర్వహించామని, రాష్ట్రంలో తొలిసారిగా ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు యాచ్ క్లబ్ ఛైర్మన్ శుభకర్ రావు చెప్పారు.

ఇదీ చదవండి:

క్రికెటర్​గా మారిన కోహ్లీ భార్య!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.