నోటికొచ్చిన మాటలన్నీ చెప్పి ప్రజల చేత ఓట్లేయించుకున్నాక... వాళ్ళ కష్టాలను పట్టించుకోకపోవడం మోసం కింద లెక్క అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్విటర్ వేదికగా మండిపడ్డారు.అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేసారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు.జగన్ ప్రమాణ స్వీకారం రోజున మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని వ్యాఖ్యనించారని కానీ..ముంచే ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు.
అత్యాచార నిందితుడిని శిక్షించాలి
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెద్దగార్లపాడులో చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గుంటూరు కేంద్ర కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులు చంద్రబాబును కలిసి నిందితులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ... సభ్య సమాజం తలదించుకునేలా ముక్కు పచ్చలారని చిన్నారిపై ఇటువంటి ఘటనలకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. సంఘటన జరిగి వారం గడుస్తున్నా నిందితులను అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.
ఇదీచదవండి