విజయవాడలో హైటెక్ జూదగాళ్ల గుట్టురట్టైంది. నగరానికి చెందిన యువకులు సులువుగా డబ్బు సంపాదించాలనే యోచనతో... చిప్ ఉన్న పేకముక్కలను దిల్లీ నుంచి కొనుగోలు చేశారు. బ్లూటూత్ సాంకేతికత వినియోగిస్తూ ఏ నెంబర్ పేక వస్తుందో ముందుగానే పసిగడుతూ అమయాకుల నుంచి నగదు లాగేస్తున్నారు. పేక ముక్కలను ముందుగానే స్కాన్ చేయటంతో ఏ నంబర్ వస్తుందో చెప్పగలుగుతున్నారని పోలీసులు తెలిపారు. గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న ఈ వ్యవహారంపై దృష్టి పెట్టిన పోలీసులు... 11 మంది నిందితులను అదుపులోకి తీసుకుని 3లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి: