ETV Bharat / city

సర్వాంగ సుందరంగా ఇంద్రకీలాద్రి... దసరా ఉత్సవాలు ప్రారంభం - దసరా ఉత్సవాలు

అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ... అంటూ భక్తజనం ప్రార్థించే అమ్మవారు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. ప్రతినిత్యం ఓ శక్తిరూపంగా ఆదిపరాశక్తి భక్తులను అనుగ్రహించనుంది. నేటి నుంచి అక్టోబర్ 8 వరకు అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు అభయమిస్తారు. తొలిరోజు అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు నయనానందం పంచనున్నారు.

సర్వాంగ సుందరంగా ఇంద్రకీలాద్రి
author img

By

Published : Sep 29, 2019, 5:36 AM IST

సర్వాంగ సుందరంగా ఇంద్రకీలాద్రి

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మకు ప్రతిఏటా దసరా ఉత్సవాలను సంప్రదాయ సిద్ధంగా నిర్వహిస్తుంటారు. దసరా ఉత్సవాల్లో తొలి రోజైన ఈ రోజు అమ్మావారు స్వర్ణకవచాలాంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారు స్వర్ణ కవచాన్ని ధరించి, దుష్టసంహారం చేసేందుకు సిద్దమైన రూపాన్ని భక్తులు కన్నులారా వీక్షించి తన్మయత్వం చెందుతారు. ఈ అవతారానికి పురాణాల్లో అత్యంత విశిష్టత వుంది.

రెండో రోజు అమ్మవారు శ్రీబాలా త్రిపుర సందరీదేవి అవతారంలో దర్శనమిస్తారు. సమస్త దేవీ మంత్రాల్లో విశిష్టమైన బాలామంత్రంకు ఎంతో ప్రాధాన్యత వుంది. శ్రీచక్రంలోని మొదటి ఆమ్నాయంలో బాలా త్రిపుర సందరీదేవి అధిదేవతగా పూజలందుకుంటోంది. అందుకే శ్రీవిద్యోపాసకులు ముందుగా బలామంత్రాన్ని ఉపదేశంగా పొందుతున్నారు. దసరా ఉత్సవాల్లో భక్తులకు ఈ అమ్మవారి రూపాన్ని దర్శించుకుంటే పూర్ణఫలం లభిస్తుంది.

మూడో రోజున అమ్మవారు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఉత్సవాల్లో నాలుగో రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శమిస్తారు. ఎడమ చేతిలో బంగారు పాత్రతో... తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే ఆకలి బాధలు వుండవని భక్తుల విశ్వాసం.

ఐదోరోజున శ్రీలలితా త్రిపురసందరీదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా.. పంచదశాక్షరీ మంత్రాధిదేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. సాక్షత్తూ శ్రీలక్ష్మి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా... చిరుమందహాసంతో.. చెరుగడను చేతపట్టుకుని.. పరమశివుని వక్షస్థలంపై కూర్చుకున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

ఉత్సవాల్లో 6వ రోజున అమ్మవారు శ్రీమహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు కనువిందు చేస్తారు. జగన్మాత మహాలక్ష్మీ అవతారంలో దుష్టసంహారం చేసి, లోకాలు కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.

7వ రోజున అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శమిస్తారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. సకల విద్యలకు అధిదేవతగా వున్న సరస్వతీ దేవిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందేందుకు విద్యార్ధులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజున అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. లోకకంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవీ స్వకంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం.

దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్థని రూపంలో తొమ్మిదో రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిస్తారు. 8భుజములు.. అష్ట ఆయుధాలు... సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే... శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం.

నవరాత్రి వేడుకల ముగింపు నాడు విజయదశమి రోజున అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. వామహస్తంలో చెరకుగడను ధరించి, దక్షిణ హస్తంలో అభయాన్ని ప్రసాదించే రూపంలో శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. చెడుపై అమ్మవారు సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి నాడు అమ్మవారి చక్కని రూపంను దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు.

ఇదీ చదవండీ... నాడు వెలవెల... నేడు జలకళ

Intro:Ap_vsp_56_28_dolimota pai girijanulu_av_ap10153Body:

మన్యంలో నిండు గర్భినీలకు డోలీ మోతలు నిత్యకృత్యంగా మారాయి.. ఏజెన్సీలో ఎక్కడో ఒక చోట ప్రసవ వేదనతో గర్భిణీలు అవస్ఘలు పడుతున్నారు. మారుమూల గిరిజన గ్రమాలకు సరైన రహదారి రశాణా సమాచార వ్యవస్థ వంటి సదుపాయాలు లేకపోవడంతో వీరికి ఇబ్బందులు తప్పడంలేదు. విశాఖ మన్యంలో మారుమూల గ్రామాలకు పూర్తిస్థాయిలో రహదారి సదుపాయాలు లేకపోవడంతో అత్యవసర సమయాల్లో ఇక్కడి గిరిజనులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. చింతపల్లి మండలం లో కుడుముసారె కు చెందిన కొర్రా సంధ్యకు నెలలు నిండటంతో శనివారం ఉదయం పురిటి నొప్పులు ఆరంభం అయ్యాయి. ప్రసవం కోసం ఈమెను లోతుగెడ్డ ఆసుపత్రికి చేర్చాలంటే సుమారు పది కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి ఉంది. కుడుముసారె పంచాయతీ కేంద్రం అయినప్పటికీ ఈ గ్రామానికి నేటికీ సరైన రహదారి లేదు. మద్యలో పెద్ద వాగు ఉంది. ఇక్కడ రూ. అయిదు కోట్లతో చేపట్టిన వెంటన నిర్మాణ పనులు నాలుగేళ్లుగా నత్తనడకనే సాగుతున్నాయి. తాత్కాలికంగా రాకపోకలు కోసం కల్వర్టులను నిర్మిస్తున్నా భారీ వర్షాలు వచ్చిన ప్రతీ సారీ కుడుముసారి పంచాయతీలోని గిరిజనుల రాకపోకలకు అత్యవసర వైద్యానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పురినొప్పులతో ఉన్న సంధ్యను లోతగెడ్డ ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబసబ్యులు గర్బీణీను డోలీమోతపై అతి కష్టం మీద వాగు దాటించి అక్కడ నుంచి ఐదుకిలోమీటర్లు దూరంలో రహదారి మార్గం ఉన్న నిమ్మపాడుకు తీసుకువచ్చారు. ఫీడర్‌ అంబులెన్స్‌పై గర్బిణీను వాహనంపై లోతుగెడ్డ ఆసుపత్రికి తీసుకువచ్చి చేర్పించారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడంతో సుఖప్రసవం అయినట్లు లోతుగెడ్డ వైద్యాధికారి రామనాయక్‌ తెలిపారు. చాలా గిరిజన గ్రామాలకు నేటికీ రహదారి రవాణా సదుపాయాలు లేకపోవడంతో గర్భిణీలు అనేక ఇబ్బందులు పడాల్సివస్తోంది. అధికార యంత్రాంగ ఇటువంటి గ్రామాలను గుర్తించి అక్కడ మౌలికసదుపాయాలు కల్పనకు కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Conclusion:M Ramana rao,si ledu,ap10153
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.