రాజధానిని మార్చకుండా చూడాలని కోరుతూ... అమరావతి పరిధిలోని రైతులు కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి వినతిపత్రం అందజేశారు. అయితే... అభివృద్ధి వికేంద్రీకరణను మొదటి నుంచి భాజపా సమర్థిస్తోందని పురందేశ్వరి అన్నారు. తెదేపా, వైకాపాలు రెండూ... రైతులకు సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. పార్టీల కోసం రైతులు తమ భూములను ఇవ్వలేదని... ప్రభుత్వానికి మాత్రమే రైతులు భూములిచ్చారని గుర్తు చేశారు. కేంద్రప్రభుత్వం నిధులు ఇచ్చినా గత ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం నియమించిన జీఎన్‌రావు కమిటీ నివేదిక పూర్తిగా బహిర్గతం కావాలన్నారు. మంత్రివర్గ సమావేశాల సమయంలోనైనా రైతుల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని పురందేశ్వరి కోరారు.
ఇదీ చదవండి: