మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి... వారిపై అణచివేత ధోరణితో వ్యవహరించడం అప్రజాస్వామికమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీడియా ప్రతినిధులపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్రకటితంగా చానళ్లను నిలిపివేయడం, మంత్రులే ఇందుకు పూనుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఆ పత్రికలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని జీవో జారీ చేయడం సరైనది కాదన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ మీడియాపై ఈ తరహాలో దాడులు చేయలేదన్నారు. నిలిపేసిన మీడియా చానళ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి...