ETV Bharat / city

నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా...స్థానిక రిజర్వేషన్లు: సీఎం

రాష్ట్రంలో అవినీతిరహిత పారదర్శత పాలన అందిస్తామని సీఎం జగన్ అన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై శాసనభలో జరిగిన చర్చలో మాట్లాడిన జగన్...నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు.

నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా...స్థానిక రిజర్వేషన్లు : సీఎం జగన్
author img

By

Published : Jul 24, 2019, 6:02 PM IST

Updated : Jul 24, 2019, 6:08 PM IST

నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా...స్థానిక రిజర్వేషన్లు : సీఎం జగన్

రాష్ట్రంలో పైస్థాయి నుంచి దిగువస్థాయి వరకు లంచం అనే మాట వినిపించదని..పారదర్శకమైన విధానం అవలంబిస్తామని ముఖ్యమంత్రి జగన్ మరోమారు స్పష్టం చేశారు. పరిశ్రమల స్థాపనలో పెట్టుబడిదారులకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవని తేల్చిచెప్పారు. శాసనసభలో పరిశ్రమలు, కర్మాగారాల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై సీఎం ప్రసంగించారు. పరిశ్రమలను ప్రోత్సాహించే దిశగానే రాష్ట్రంలోని ప్రతీ నిర్ణయమూ ఉందని ఆయన తేల్చి చెప్పారు. స్థానిక యువతకు ఉపాధి ఉండాలనే ఈ బిల్లును తీసుకువస్తున్నామని జగన్ అన్నారు. పరిశ్రమలతో కలసి యువతకు నైపుణ్యాలను అందించే ప్రయత్నం చేస్తామన్నారు. తమ ప్రభుత్వం వేసే ప్రతీ అడుగూ పరిశ్రమల ప్రోత్సాహానికే అని గుర్తించాలన్నారు. విద్యుత్ ఒప్పందాలను సమీక్షిస్తున్నందున పరిశ్రమలు రావన్న దుష్ప్రచారం జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. విద్యుత్ ధరలు తగ్గించి సరఫరా చేసేది పరిశ్రమలు, రైతులకు, ప్రజలకేనని అన్నారు. విద్యుత్ ధరలు తగ్గితే వారికే లబ్ధి కలుగుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పరిశ్రమలు, కర్మాగారాల్లో స్థానిక యువతకు రిజర్వేషన్ల కల్పించే ఈ బిల్లు చారిత్రాత్మకం అవుతుందని అన్నారు. పరిశ్రమలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని స్థానికులకు హామీ ఇస్తే...పరిశ్రమల స్థాపనకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని అన్నారు. పార్లమెంటు నియోజకవర్గాలలో వృత్తి నైపుణ్య శిక్షణ సెంటర్లు ఏర్పాటు చేసి...స్థానిక పరిశ్రమలకు ఉపయోగపడే శిక్షణ ఇస్తామని తెలిపారు. పరిశ్రమలకు మూడేళ్లు సమయం ఇస్తామని స్పష్టం చేసిన జగన్...తర్వాత స్థానిక యువతను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి : స్థానిక యువతకే.. 75శాతం రిజర్వేషన్లు

Intro:16 ఏళ్ల తరువాత పుత్రోత్సాహం

Body:ఈటీవీ జీ

Conclusion:ఈటీవీ
Last Updated : Jul 24, 2019, 6:08 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.