విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం వద్ద నుంచి పాదయాత్రగా వెళ్లేందుకు ఐకాస నేతలు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా ఐకాస నాయకులను అడ్డగించారు. ఈ క్రమంలో పోలీసులతో నేతలు వాగ్వాదానికి దిగారు. బస్సు యాత్ర ప్రారంభించే తీరుతామని నేతలు భీష్మించారు. బస్సులు అ.ప.స. కేంద్ర కార్యాలయం వద్దకు తీసుకురావాలని... లేకుంటే తామే బస్సుల వద్దకు పాదయాత్రగా వెళ్తామని పోలీసులతో వాదించారు.దింతో చంద్రబాబు సహా ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులతో తమను నిలువరించలేరని.... ఉద్యమాన్ని ఆపలేరని చంద్రబాబు మండిపడ్డారు.
ఇదీచదవండి