ETV Bharat / city

సైబర్​ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి

రాష్ట్ర సచివాలయంలోని ఐదు బ్లాక్​లో 'సైబర్ నేరాల నుంచి మహిళలకు రక్షణ' అంశంపై సదస్సు జరిగింది. హోంమంత్రితో పాటు డీజీపీ, పలువురు మహిళ మంత్రులు పాల్గొన్నారు. సైబర్ మోసాల బారిన పడకుండా మహిళలు జాగ్రత్తగా ఉండాలని డీజీపీ గౌతం సవాంగ్ పిలుపునిచ్చారు.

సైబర్​ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: హోమంత్రి
author img

By

Published : Jul 26, 2019, 12:21 PM IST

Updated : Jul 26, 2019, 1:44 PM IST

అమరావతిలో సైబర్ నేరాల నుంచి మహిళలకు రక్షణ అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్ పాల్గొన్నారు. వీరితో పాటు మహిళా మంత్రులు పుష్ప శ్రీవాణి, తానేటి వనిత, మహిళా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ... సైబర్ నేరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేరాలు ముఖ్యంగా మహిళలు, చిన్నారులే లక్ష్యంగా జరుగుతున్నాయని అన్నారు. సైబర్ మోసాల నియంత్రణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. సైబర్ మోసాల బాధితులు నిర్లక్ష్యం వహించకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రస్తుతం 2 సెకన్ల వ్యవధిలో ఏ విషయమైనా స్మార్ట్​ఫోన్లకు చేరిపోతుందని అన్నారు. సాంకేతికతతో ప్రయోజనాలు ఉన్నా.. అనర్థాలు పెరగడం ఆందోళనకరమన్నారు. బాధితులకు సత్వర న్యాయం కోసం ప్రతి ఒక్కరి సహకారం కావాలని సుచరిత కోరారు. సైబర్ మోసాల తీరు, బాధితులకు భరోసా వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ, పోలీస్ యంత్రాంగానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

సైబర్​ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి

సైబర్ నేరాలపై ప్రత్యేక ఫోన్ నంబర్..

సైబర్ నేరాలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఫిర్యాదు కోసం సైబర్ మిత్ర పేరిట ఫేస్​బుక్, వాట్సాప్ నెంబర్లను ఏర్పాటు చేశారు. సైబర్ నేరాలపై మహిళలు ఫిర్యాదు చేసేందుకు '9121211100' నంబర్​ను కేటాయించారు.

Intro:ap_tpg_81_26_trutilotappinapramadam_ab_ap10162

Body:16వ నెంబర్ జాతీయ రహదారిపై దెందులూరు మండలం లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది హైదరాబాద్ నుంచి యానం వెళుతున్న ప్రైవేట్ బస్సు ఉ దెందులూరు మండలం కొమరవెల్లి పరిధిలో అదుపుతప్పింది దేవాలయాలపై సుమారు వంద మీటర్ల దూరం ప్రయాణిస్తూ మధ్యలో నిలిచిపోయింది ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు హైవే పెట్రోలింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బస్సును అక్కడి నుంచి తొలగించే చర్యలు చేపట్టారు మధ్యలో రహదారికి అటు ఇటు వైపు బస్సు ఆగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది ఎవరికి కావాలి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు

Conclusion:
Last Updated : Jul 26, 2019, 1:44 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.