ప్రభుత్వం రాజధాని అమరావతిపై కమిటీల పేరుతో ప్రజలను మభ్యపెడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. విజయవాడలో గద్దె రామ్మోహన్ దీక్షకు సంఘీభావం తెలిపిన ఆయన.. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రాంతాల వారు అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతున్నారని అన్నారు. విశాఖ రాజధానిగా వద్దని విశాఖ వాసులే అంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు విశాఖ దూరంగా ఉందని పేర్కొన్నారు. అమరావతిలో పునాదులకు ఎక్కువ ఖర్చనేది తప్పుడు ప్రచారమన్న చంద్రబాబు.. తాను ఎప్పుడూ ఉద్యోగులను గౌరవిస్తానని చెప్పారు. రాజధానిపై సీఎం, మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మన పిల్లలు వేరే ప్రాంతాలకు వెళ్లకుండా అమరావతికి శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: