నాలుగు కీలక బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. భూయజమానుల హక్కులకు భంగం కలగకుండా కౌలు రైతులకు ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా ఆంధ్రప్రదేశ్ పంటల సాగుదారుల హక్కుల బిల్లును సభ ఆమోదించింది. పాలకమండళ్ల రద్దు, నియామకాలు, తితిదేలో తుడా ఛైర్మన్ సభ్యునిగా చేర్చేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ, హిందూ ధార్మిక సంస్థలు, దేవాలయాల సవరణ బిల్లుకు సభ ఆమోదం లభించింది.
విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ వయస్సును 65 ఏళ్లకు తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాసనాల సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, కర్మాగారాల స్థానిక అభ్యర్థుల ఉపాధి బిల్లుకు ఆమోదం లభించింది. సమగ్ర చర్చల అనంతరం ఈ బిల్లులను శాసనసభ ఆమోదించింది.
ఇదీ చదవండి : పీఏసీ ఛైర్మన్గా పయ్యావుల కేశవ్