ETV Bharat / city

అమెరికా అబ్బాయితో తెలంగాణ అమ్మాయి పెళ్లి...

"ప్రేమించిన అమ్మాయి కోసం... ఏడేడు సముద్రాలైనా దాటుతా... ఎంత మందినైనా ఎదిరిస్తా..." అంటూ సినిమాల్లో హీరోలు పంచ్​ డైలాగులు విసురుతుంటే... ఈలలు కొడుతుంటాం. ఇక్కడ అదే డైలాగ్​ని నిజం చేస్తూ... మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లాడాడు ఈ అమెరికా అబ్బాయి. డల్లాస్​లో కలుసుకున్న తెలంగాణ పాలమూరు అమ్మాయి, అమెరికా అబ్బాయి ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో... హైదరాబాద్​లో ఒక్కటయ్యారు.

అమెరికా అబ్బాయితో తెలంగాణ అమ్మాయి పెళ్లి...
author img

By

Published : Nov 10, 2019, 11:43 PM IST

అమెరికా అబ్బాయితో తెలంగాణ అమ్మాయి పెళ్లి...

అమెరికా అబ్బాయి... తెలంగాణలోని పాలమూరు అమ్మాయి ఏడు అడుగులు, మూడు ముళ్లతో ఒకటయ్యారు. మహబూబ్‌నగర్‌కు చెందిన వర్షిణి, అమెరికాలోని డల్లాస్‌కు చెందిన హెన్రిహుడ్​గిన్స్‌ల వివాహం హైదరాబాద్‌ బేగంపేట టూరిజం ప్లాజాలో హిందూ సంప్రదాయం ప్రకారం వైభవంగా జరిగింది.

ఉద్యోగమే కలిపింది...

హైదరాబాద్‌లో బీటెక్‌ పూర్తి చేసిన వర్షిణి... ఎంఎస్‌ చేసేందుకు నాలుగేళ్ల కిందట అమెరికాకు వెళ్లింది. చదువు పూర్తికాగానే... డల్లాస్‌లోని క్యాపిటల్‌ ఒన్‌ సంస్థలో జూనియర్‌ సాప్ట్‌వేర్‌ ఇంజినీర్​గా చేరింది. అదే సంస్థలో సీనియర్‌ సాప్ట్‌వేర్‌ ఇంజినీర్​గా పనిచేస్తున్న హెన్రి హుడ్‌ గిన్స్‌తో ఆమెకు స్నేహం ఏర్పడింది. ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చటం వల్ల స్నేహం కాస్తా... ప్రేమగా మారింది.

కుటుంబాల అంగీకారంతో...

కొన్నిరోజుల ప్రేమాయణం తర్వాత వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట... ఇరు కుటుంబాలను ఒప్పించేందుకు ఏడాదికాలంగా ప్రయత్నిస్తూ వచ్చారు. నానా తంటాలు పడి చివరకు ఇరు వైపులా పెద్దలను ఒప్పించారు ఈ ప్రేమ పక్షులు. హిందూ సంప్రదాయం ప్రకారం హైదరాబాద్‌లో వివాహబంధంతో ఒక్కటయ్యారు.

పెళ్లిపెద్దగా మంత్రి శ్రీనివాస్​ గౌడ్​...

పెళ్లి కుమారుడు హెన్రి తరఫున తల్లి, సోదరుడు హాజరుకాగా... వర్షిణి తరఫున చిన్నాన్న, చిన్నమ్మలతోపాటు దగ్గర బంధువులు హాజరయ్యారు. ఇవాళ 11.15 గంటలకు బేగంపేట టూరిజం ప్లాజాలో వారిద్దరి వివాహం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌... పెళ్లిపెద్దగా దగ్గరుండి వివాహం జరిపించారు. సుఖసంతోషాలతో కలిసుండాలని వధూవరులను మంత్రి ఆశీర్వదించారు.

ఇదీ చూడండి:

మహేశ్ మేనల్లుడు అశోక్ హంగామా..

TG_HYD_23_10_AMERICA_ABBAI_PALAMOORU_AMMAI_PELLI_AV_3038066 REPORTER : Tirupal Reddy ()అమెరికా అబ్బాయి....పాలమూరు అమ్మాయి ఏడు అడుగులు వేసి ఒకటయ్యారు. మహబూబ్‌నగర్‌కు చెందిన వర్షిణి, అమెరికాలోని డల్లాస్‌కు చెందిన హెన్రి హుడ్‌ గిన్స్‌ల వివాహం హైదరాబాద్‌ బేగంపేట టూరిజం ప్లాజలో హిందూ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. మహూబూబ్‌నగర్‌కు చెందిన వర్షిణి హైదరాబాద్‌లో బీటెక్‌ పూర్తి చేసి..ఎంఎస్‌ చేసేందుకు నాలుగేళ్ల కిందట అమెరికాకు వెళ్లింది. అక్కడ ఎంఎస్‌ పూర్తికాగానే డల్లాస్‌లోని క్యాపిటల్‌ ఒన్‌ సంస్థలో జూనియర్‌ సాప్ట్‌వేర్‌గా వర్షిణి ఉద్యోగం వచ్చింది. అదే సంస్థలో సీనియర్‌ సాప్ట్‌వేర్‌గా పని చేస్తున్న హెన్రి హుడ్‌ గిన్స్‌ స్నేహం ఏర్పడి అది ప్రేమగా చిగురించింది. వారిద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని ఇరు కుటుంబాలను ఒప్పించేందుకు గత ఏడాదికాలంగా ప్రయత్నిస్తూ వచ్చారు. చివరకు ఇరు కుటుంబాలు అంగీకారానికి రావడం...హిందూ సంప్రదాయం ప్రకారం హైదరాబాద్‌లో పెళ్లి జరిగేట్లు ఒప్పందం కుదిరింది. పెండ్లి కుమారుడు హెన్రి తరఫున ఆయన తల్లి, సోదరుడు హాజరుకాగా...వర్షిణి తరుఫున ఆమె చిన్నాన్న, చిన్నమ్మలతోపాటు దగ్గర బంధువులు హాజరయ్యారు. ఇవాళ 11.15 గంటలకు బేగంపేట టూరిజం ప్లాజలో వారిద్దరి వివాహం జరిగింది. రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ దగ్గర ఉండి వారి వివాహం జరిపించడంతోపాటు వధూవరులను ఆశీర్వదించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.