విజయవాడలో అమరావతి క్రాఫ్ట్స్ మేళా అంతరించిపోతున్న హస్తకళలను ప్రోత్సహించి కళాకారులకు చేయూతనిచ్చేందుకు నాబార్డ్ ఆధ్వర్యంలో విజయవాడలో అమరావతి క్రాఫ్ట్స్ మేళాను ఏర్పాటుచేశారు. మారిస్ స్టెల్లా ఇండోర్ మైదానంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనను నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ సెల్వరాజ్ మంగళవారం ప్రారంభించారు. రాష్ట్రంలోని పది జిల్లాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు తమ ఉత్పత్తులను స్టాల్స్‌లో ప్రదర్శిస్తున్నారు. కొండపల్లి బొమ్మలు, నేత వస్త్రాలు, జనపనార సంచులు, అలంకరణ వస్తువుల ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రదర్శన ఫిబ్రవరి మూడో తేదీ వరకు కొనసాగుతుంది.
ఇదీ చదవండి : వైభవంగా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు