ఆదిలక్ష్మి మూడో తరగతి చదువుతున్నప్పుడు... బడికెళ్లనని మారాం చేసింది. తనని తల్లి కోప్పడింది. అమ్మమీద అలిగి ఇంట్లోంచి పారిపోయింది ఆదిలక్ష్మి. విజయవాడ బస్టాండ్‌లో తిరుగుతున్న ఆదిలక్ష్మిని ఓ మహిళ చెన్నై తీసుకెళ్లింది. అక్కడే మధురిమ అనే మహిళకు 500 రూపాయలకు అమ్మేసింది. మధురిమ ఆదిలక్ష్మిని లత అని పేరు పెట్టి కన్నకూతురిలా పెంచింది.
18 ఏళ్లు దాటాక మధురైకిి చెందిన కాంచీవరంతో వివాహం జరిపించింది. భర్త చెంత సంతోషంగా గడుపుతున్న లతకు తల్లిదండ్రులు గుర్తొచ్చారు. ఆ విషయం భర్తకు చెప్పాక... అన్వేషణ ప్రారంభమైంది. ముందుగా చెన్నైలోని లాయర్ సాయం తీసుకుంది ఆదిలక్ష్మి. ఆయన ఇచ్చిన సూచనతో విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భర్తతో సహా వచ్చి ఫిర్యాదు చేసింది. పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలసి తనకు సాయం చేయాలని కోరింది.
దాదాపు 13 ఏళ్ల తరువాత కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఆమెకు తల్లిదండ్రుల ఆచూకీ లభించటంతో... కథ సుఖాంతమైంది. కళ్లల్లో ఆనందభాష్పాలు, ఆలింగనాలతో ఆ కుటుంబంలో సంతోషం నిండిపోయింది.
ఇవి కూడా చదవండి: