ETV Bharat / city

మూడు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి కొత్త ప్రాంతాలు - తుడా పరిధి పెంపు న్యూస్

రాష్ట్రంలోని మూడు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిని ప్రభుత్వం విస్తరించింది. కాకినాడ కేంద్రంగా ఉన్న... గోదావరి అర్బన్ డెవలప్​మెంట్​ అథారిటీ, తిరుపతి కేంద్రంగా ఉన్న తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీల్లో మరికొన్ని మున్సిపాలిటీలు, మండలాలను కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

3 Urban Devlopment Authorities Area Extention

author img

By

Published : Jan 29, 2020, 5:25 AM IST

Updated : Jan 29, 2020, 7:04 AM IST

మూడు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి కొత్త ప్రాంతాలు

గోదావరి అర్బన్ డెవలప్​మెంట్​ అథారిటీ-గుడా, తిరుపతి అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ-తుడా, అనంతపురం-హిందుపూర్ అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీల పరిధిని పెంచుతూ పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. సమీపంలోని మున్సిపాలిటీలు, మండలాలను వీటి పరిధిలోకి తెచ్చారు. కాకినాడ కేంద్రంగా ఉన్న గోదావరి అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ పరిధిలో కొత్తగా మండపేట, అమలాపురం, ముమ్మిడివరం, యేలేశ్వరం మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను కలిపారు. ప్రస్తుతం ఉన్న పరిధికి అదనంగా 24 మండలాల్లోని 236 గ్రామాలు గుడా పరిధిలో విలీనం అయ్యాయి.

ప్రస్తుతం 2 వేల 183 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఉన్న గుడా పరిధి నాలుగు పురపాలికల చేరికతో 4 వేల 396 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి చేరింది. గతంలో నాలుగు పురపాలికలు, 26 మండలాల్లోని 280 గ్రామాల పరిధి కలిగిన గోదావరి అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీలోకి 2018లో తుని, రామచంద్రాపురం మున్సిపాలిటీల్లోని 7 మండలలాలు, 74 గ్రామాలను కలిపారు.

అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ-అహుడా పరిధిలోకి.... రాప్తాడు నియోజకవర్గంలోని ఐదు మండలాలను తీసుకువచ్చారు. రాప్తాడు, చెన్నెకొత్తపల్లి, కనగానపల్లి, ఆత్మకూరు, రామగిరి మండలాల్లోని 1570 చదరపు కిలోమీటర్ల ప్రాంత పరిధిని తీసుకువస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అహుడా పరిధిలోకి 6వేల 591 చదరపు కిలోమీటర్ల ప్రాంతం వచ్చి చేరింది.

తిరుపతి అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ-తుడా పరిధిలోకి నగరి మున్సిపాలిటీతో పాటు నారాయణవనం, వెదురుకుప్పం, తొట్టెంబేడు, కె.వి.బి పురం, బి.ఎన్ కండ్రిగ, వరదయ్యపాలెం, సత్యవేడు, విజయపురం, నాగలాపురం, కార్వేటినగరం, నిండ్ర, పిచ్చాటూరు మండలాలు చేరుస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు.. పుత్తూరు, శ్రీకాళహస్తి పురపాలికలు, 158 గ్రామాలే ఇప్పటి వరకూ తుడా పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు 13 మండలాల్లోని 413 గ్రామాలను అదనంగా తుడా పరిధిలోకి చేర్చారు. కొత్త విస్తరణతో తుడా పరిధి 4వేల527 చ.కిలోమీటర్లకు చేరింది.

ఇదీ చదవండి:

పెరిగిన 'తుడా' పరిధి.. కొత్తగా 13 మండలాలు చేరిక

Last Updated : Jan 29, 2020, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.