వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. యాత్రికులతో వైకుంఠం-2లోని 31 కంపార్ట్‌మెట్లు, నారాయణగిరిలోని క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. ప్రస్తుతం తిరుమాడవీధుల్లో ఏర్పాట్లు చేసిన షెడ్లలోనికి భక్తులను అనుమతిస్తున్నారు. వర్షం నుంచి.... చలిగాలుల నుంచి రక్షణ కల్పించే విధంగా షెడ్లను ఏర్పాటు చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా యాత్రికులు క్యూలైన్లలోనికి చేరుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రద్దీని క్రమబద్దీకరిస్తున్నామంటున్న తితిదే సీవీఎస్‌వో గోపీనాథ్ జెట్టీతో మా ప్రతినిధి ముఖాముఖీ.
ఇవీ చూడండి: