జీవితంలో ఒక్కసారైనా కనులారా ఆ స్వామిని దర్శించుకోవాలని ప్రతి భక్తుడూ కోరుకుంటాడు. ఇల వైకుంఠంగా.....నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లే... ఆ దేవదేవుని వైభవాన్ని తిలకించాలని... భక్త కోటి ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి తిరుమల శ్రీవారి ఆలయంలో సాధారణ భక్తులకు దర్శనాలే ప్రథమ ప్రాధాన్యంగా తితిదే అధికారులు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. దశాబ్దాల నాటి సమస్యలకు చరమగీతం పాడుతూ......ఆలయ అభివృద్ధికై కృషి చేస్తున్నారు. అలిపిరి కాలి నడక దారి అభివృద్ధి, నూతన బూందిపోటు నిర్మాణం, శ్రీవాణి ట్రస్ట్ విరాళాల ద్వారా వీవీఐపీ దర్శనాలు సహా....దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామంటున్నారు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామంటోన్న ఆయనతో ఈటీవీ భారత్ ముఖాముఖి..!
ఇవీ చూడండి: