ఆంగ్ల నూతన సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వేడుకలను పురస్కరించుకుని ఆయా రోజుల్లో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి అన్నిరకాల ఆర్జితసేవలను, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో అన్ని ఆర్జిత సేవలతోపాటు, దాతలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలకు కల్పించే ప్రత్యేక దర్శనం కోటా రద్దు చేసినట్లు తెలిపారు. టైం స్లాట్, దివ్య దర్శనం, అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీ ఉండదన్నారు.
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 5 నుంచి 7 వరకు ఆర్జిత సేవలతోపాటు ప్రివిలేజ్డ్, ప్రత్యేక ప్రవేశం, టైంస్లాట్, దివ్యదర్శనం, అంగప్రదక్షిణ టోకెన్ల జారీ ఉండదని స్పష్టం చేశారు. జనవరి 6న తెల్లవారుజామున 2 గంటల నుంచి వైకుంఠ ద్వారదర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు.
ఇవీ చూడండి: