శ్రీవారి సేనాధిపతి ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ వసంతమండపానికి చేరుకున్నారు. భూమిపూజ, మృత్సంగ్రహణం కార్యక్రమాల తర్వాత ప్రదక్షిణంగా ఆలయానికి చేరుకున్నారు. వసంతమండపంలో సేకరించిన పుట్టమన్నుతో అర్చకులు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. పుష్పయాగంలో భాగంగా ఇవాళ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఉత్సవ మూర్తులకు సన్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు 8 టన్నుల పూలతో పుష్పకైంకర్యాన్ని నిర్వహిస్తారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల నుంచి చామంతి, సంపంగి, రోజా, మరువం, దవనం, తులసి, గన్నేరు, నందివర్ధనం వంటి సాంప్రదాయ కుసుమాలు సేకరించారు.
ఇదీ చదవండి:తిరుమల శ్రీవారి ఆలయంలో... పుష్పయాగ మహోత్సవానికి ఏర్పాట్లు