ETV Bharat / city

కావాలనే తితిదేపై దుష్ప్రచారం చేస్తున్నారు: శ్రీకాంత్​రెడ్డి - srikanthreddy comments on pawan kalyan news

తిరుమల తిరుపతి దేవస్థానంపై కావాలనే కొందరూ దుష్ప్రచారం చేస్తున్నారని... ప్రభుత్వ చీఫ్​విప్ శ్రీకాంత్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

srikanthreddy-comments-on-tirumala-controversy
srikanthreddy-comments-on-tirumala-controversy
author img

By

Published : Dec 3, 2019, 8:01 PM IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండాలని, సుభిక్షంగా ఉండాలని కోరుతూ... తిరుమలకు పాదయాత్ర చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్​విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఆరు నెలల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్​కే దక్కుతుందని అన్నారు. ఈ మధ్య కాలంలో తితిదేపై కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్యులను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి దర్శనభాగ్యం కోసం తితిదే కృషి చేస్తోందని వ్యాఖ్యానించారు. కులం, మతం పేరుతో పవన్ కల్యాణ్ అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు పవన్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

కావాలనే తితిదే పై దుష్ప్రచారం: శ్రీకాంత్ రెడ్డి

ఇదీ చదవండి : మహిళను కాపాడిన అర్జునరావుకు సీఎం అభినందనలు

Intro:ప్రతిపక్షాలపై విరుచుకు పడ్డ ప్రభుత్వవిప్,రాయచోటి ఎం.ఎల్.ఎ శ్రీకాంత్ రెడ్డి.Body: Ap_tpt_37_03_srikanth_reddy_press_meet_av_ap10100

తిరుమల పాదయాత్రలో భాగంగా శ్రీనివాసమంగాపురంలో మీడియాతో మాట్లాడిన ప్రభుత్వవిప్,రాయచోటి ఎం.ఎల్.ఎ శ్రీకాంత్ రెడ్డి.......
ఆంధ్రరాష్ట్రం జగన్మోహనరెడ్డి పరిపాలనలో అభివృద్ధిలో ముందుండాలని..... రాష్ట్ర ప్రజలు సుఖసంతోసాలతో.... శుబిక్షంగా ఉండాలని కోరుతూ తిరుమలకు పాదయాత్ర చేస్తున్నట్లు రాయచోటి ఎం.ఎల్.ఏ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.ఈ మధ్యకాలంలో టిటిడి ని అభాసుపాలుచేయడానికి కొందరు పూనుకున్నారు అన్నారు. సామాన్యులను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి దర్శన భాగ్యం కోసం టీటీడీ ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి కృషి చేస్తున్నారన్నారు.కలియుగ వేంకటేశ్వర స్వామిని రాజకీయాలలోకి లాగాలనే ప్రయత్నం దుర్మార్గం అని.... సోలార్ ఫ్యానల్ పెడితే ప్లస్ సింబల్ అని దుస్ప్రచారం చేయడం హేయమైన చర్య అంటూ దుయ్యబట్టారు. గుంటూరు జిల్లాలో వేంకటేశ్వర స్వామికి ఉండాల్సిన చోట చంద్రబాబునాయుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతవరకు సబబు అని అన్నారు.గతంలో తిరుమలలో జరిగిన అవినీతి అక్రమాలు అందరికి తెలుసునాని వారికి ఇప్పుడు ఇబ్బందిగా ఉందని అన్నారు.పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు తొత్తుగా ఉన్నారని దుయ్యబట్టారు.
పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడినా కూడా అల్లకల్లోలం సృష్టించాలని కులాలు,మతాల పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు.పవన్ కళ్యాణ్ ను చూస్తే కుంభకర్ణుడిని గుర్తుకు వస్తున్నారన్నారు.
రాష్ట్ర ప్రజలను సమానంగా చూడాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల్లో చరిత్రలో ఎవ్వరూ ఊహించని విధంగా సంక్షమ పథకాలు ప్రవేశపెట్టారని .... అందుకే ప్రజాభిమానాన్ని చూరగొంటున్న జగన్ని చూసి ఓర్వలేకనే నిందలు వేస్తున్నారని అన్నారు.జగన్ మద్యాన్ని దశల వారిగా రూపుమాపుతున్నారు.
సీ.ఎం జగన్ ఆరు నెలల్లో ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల పేర్లను పవన్ కళ్యాణ్, చంద్రబాబునాయుడులు చెప్పగలిగితే రాజకీయాల నుంచి వైదొలుగుతానన్నారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.