వారంలోగా శ్రీవారి ఆలయ ప్రధాన అర్చక బాధ్యతలు స్వీకరిస్తానని రమణ దీక్షితులు అన్నారు. ఆగమ సలహా మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారన్న ఆయన.... ప్రధాన అర్చక పదవి చేపట్టిన వెంటనే ఆయన కోసం ప్రత్యేక పూజలు చేస్తామని తెలిపారు. అర్చకులంతా సీఎం జగన్‌కు రుణపడి ఉంటారని స్పష్టం చేశారు. గతంలో తనపై అనేక ఆరోపణలు చేశారని... బలవంతంగా పదవీ విరమణ చేయించినందునే కోర్టుకు వెళ్లామన్నారు.
ఇవి కూడా చదవండి: