పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా.. మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై.. తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నగర పాలక సంస్థ వద్ద నల్ల జెండాలతో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు...తెదేపా కార్యకర్తలు బైఠాయించారు. అమరావతే ముద్దు....మూడు రాజధానులు వద్దంటూ... ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అమరావతి పరిరక్షణ పోరాటానికి సహకరించాలని....పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్నారు.
అనంతరం కొందరు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో....అమరావతి పై న్యాయ పోరాటం చేస్తామన్నారు. శాసనమండలి సమావేశాల ప్రత్యక్షప్రసారాలను....ఎందుకు నిలిపివేశారో ముఖ్యమంత్రి ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అమరావతి పరిరక్షణ కోసం... పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ఉద్యమంలో పాల్గొనాలని మాజీ ఎమ్మెల్యే కోరారు.
ఇవీ చదవండి:
'కేసు పెట్టి రిమాండ్కు పంపిస్తా'.. తెదేపా నేతలకు ఎస్సై వార్నింగ్