తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన ఎంపీడీవో అనుమానాస్పదంగా మృతి చెందింది. నగరి నియోజకవర్గం విజయపురం ఎంపీడీవో పూర్ణచంద్రిక తిరుపతిలోని ప్రైవేటు ఆసుపత్రిలో కిడ్నీ సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకునేది. అందులో భాగంగానే శనివారం శస్త్రచికిత్స చేయించుకునే సమయంలో చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంగానే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి: