తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఉదయం ఐదున్నర గంటల సమయంలో గుర్తు తెలియని భక్తుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీవారి ఆభిషేకానికి తిరుమల గోశాల నుంచి పాలు తీసుకువస్తున్న వాహనం ఆలయం ముందుకు రాగానే ఓ భక్తుడు పాల ట్యాంకర్ కింద పడ్డాడు. ట్యాంకర్ వెనుక టైర్లు తలపై నుంచి వెళ్లడం వల్ల సంఘటనా స్థలంలోనే భక్తులు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న తితిదే భద్రతా సిబ్బంది, తిరుమల పోలీసులు మాఢ వీధుల్లోకి చేరుకొని మృతదేహాన్ని అశ్విని ఆసుపత్రికి తరలించారు. పాల వాహనాన్ని తిరుమల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆలయం ముందు... తూర్పు మాఢ వీధిలో భక్తుడు చనిపోవడం వల్ల స్వామివారి కైంకర్యాలను నిలిపివేశారు. ఆగమశాస్త్రోక్తంగా శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వామివారి నిత్యపూజలు చేపట్టారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
ఇదీ చదవండి: