ETV Bharat / city

గ్రా'నైట్'... రైట్.. రైట్.. - చిత్తూరులో అక్రమంగా గ్రానైట్ రవాణ తాజా వార్తలు

గ్రానైట్ రవాణాలో అక్రమార్కులు హద్దులు దాటేస్తున్నారు. అర్థరాత్రి వేళ సరిహద్దులు దాటిస్తున్నారు. అత్యంత విలువైన ఖనిజాన్ని గుట్టుచప్పుడు కాకుండా.. తరలిస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

granite-transport-
author img

By

Published : Nov 16, 2019, 11:22 AM IST

● కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలోని ఓ క్వారీ నుంచి రాతి దిమ్మెలతో బయలుదేరిన లారీ అర్ధరాత్రి 12 గంటలకు కర్ణాటక పరిధిలోని రాజుపేట రోడ్డుకు చేరుకుంది.. అక్కడ నిలిచి ఉన్న ఓ వ్యక్తి చేతికి లారీ డ్రైవర్‌ ఏదో అందించాడు.. దాన్ని తీసుకున్న వ్యక్తి సైగ చేయడంతో..కుప్పం- పలమనేరు జాతీయ రహదారిలో కుప్పం వైపునకు లారీ పయనమైంది.. శాంతిపురానికి చేరుకోగానే అక్కడ ఉన్న ఓ వ్యక్తి పొమ్మంటూ సిగ్నల్‌ ఇచ్చాడు.. కొద్ది నిమిషాలకే పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం లారీకి ఎదురుపడినా సిబ్బంది పట్టించుకోలేదు. లారీ కుప్పం మీదుగా సరిహద్దులు దాటి పోయింది.

● వి.కోట వైపు నుంచి భారీ గ్రానైట్‌ దిమ్మెతో కుప్పం వైపునకు వెళ్తున్న ఓ లారీ శాంతిపురం మండలం మఠం వద్ద తెల్లవారుజామున జాతీయ రహదారిలో అదుపు తప్పింది. సమాచారం అందుకున్న సంబంధిత క్వారీ వ్యాపారి నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకున్నాడు..యంత్రాల సాయంతో వెంటనే లారీని రోడ్డుపైకి తీసుకొచ్చి గమ్యం వైపునకు మళ్లించారు.

● చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సాగుతున్న గ్రానైట్‌ అక్రమ రవాణా బాగోతానికి నిదర్శనం ఈ సంఘటనలు.

హద్దుల్లేకుండా.. సరిహద్దులు దాటిస్తూ..
జిల్లాకు మూడువైపులా తమిళనాడు, కర్ణాటక సరిహద్దులు ఉండటం అక్రమార్కులకు కలిసొచ్చింది. తూర్పు, పశ్చిమ ప్రాంత మండలాల నుంచి సులభంగా రాతి సంపద ఎల్లలు దాటుతోంది. ముఖ్యంగా తమిళనాడుకు జిల్లా నుంచి అధికంగా గ్రానైట్‌ చేరుతోంది.

కుప్పం, పలమనేరు నియోజకవర్గాలతోపాటు బంగారుపాళ్యం, చిత్తూరు గ్రామీణ, గుడిపాల, యాదమరి, జీడీ నెల్లూరు, తవణంపల్లె, ఎస్‌.ఆర్‌.పురం తదితర ప్రాంతాలు గ్రానైట్‌ నిక్షేపాలకు ప్రసిద్ధి. ఈ ప్రాంతాలు చాలా వరకు తమిళనాడు సరిహద్దులను ఆనుకొని ఉన్నాయి. స్థానికంగా గ్రానైట్‌ పరిశ్రమలు పరిమితంగా ఉన్నా.. రాతి తవ్వకాలు.. తరలింపు మాత్రం భారీ స్థాయిలో సాగుతోంది. ఇందులో అధికశాతం తవ్వకాలు అనధికారికమన్నది బహిరంగ రహస్యమే. స్థానికంగా తవ్విన రాతి సంపదను అధికంగా పొరుగు రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఇందులో నామమాత్రంగా ప్రభుత్వం అనుమతిని తీసుకోవడం.. గ్రానైట్‌ దిమ్మెలను అక్రమ మార్గంలో సరిహద్దులను దాటిస్తున్నట్లు తెలుస్తోంది.

అర్ధరాత్రి వేళ దర్జాగా తరలింపు..
రాత్రి అయితే చాలు.. గ్రానైట్ లారీలు అడ్డులేకుండా దూసుకెళుతున్నాయి. తెల్లవారుజాముకు తమిళనాడుకు చేరిపోతాయి. రాత్రివేళ రహదారుల్లో పెట్రోలింగ్‌, ఇతరత్రా గస్తీల సందర్భంలో పోలీస్‌ వాహనాలకు గ్రానైట్‌ అక్రమ తరలింపు లారీలు ఎదురుపడినా.. పట్టించుకోరు. క్వారీల్లో ‘హద్దు’లు మీరి రాతి తవ్వకాలు, తరలింపుపై గనులశాఖ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టకపోవడంతో అక్రమార్కులకు ఇష్టారాజ్యంగా మారినట్లు విమర్శలు చోటు చేసుకొంటున్నాయి.

కుప్పం, శాంతిపురం, రామకుప్పం, గుడుపల్లె మండలాలతోపాటు పలమనేరు నియోజకవర్గంలోని వి.కోట మండలంలో సుమారు 50 వరకు క్వారీలున్నాయి. వాటితోపాటు అనధికారికంగా మరో 70 వరకు క్వారీల్లో తవ్వకాలను యథేచ్ఛగా సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈప్రాంతంలో ‘కుప్పం గ్రీన్‌’ పేరుతో పిలిచే రాతి దిమ్మెలు అధికంగా తమిళనాడు చేరుతున్నాయి. వీటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆశించిన మార్కెట్‌ ఉండటంతో.. డిమాండు అధికంగా ఉంది. కుప్పం, వి.కోట ప్రాంతాల నుంచి ప్రతి రోజూ పదుల సంఖ్యలో గ్రానైట్‌ లారీలు సరిహద్దులు దాటుతున్నాయి. వీటిలో చాలా వాటికి ప్రభుత్వ అనుమతి ఉండదు.

విజిలెన్స్‌ అధికారులు వస్తేనే..
గ్రానైట్‌ అక్రమ రవాణాపై అప్పుడప్పుడూ విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేస్తున్నా.. స్థానిక అధికారుల్లో స్పందన ఉండటం లేదు. తిరుపతికి చెందిన విజిలెన్స్‌ అధికారుల బృందం కుప్పం పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించి.. పదుల సంఖ్యలో గ్రానైట్‌ అక్రమ తరలింపు లారీలను అదుపులోనికి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

ఎస్వీ విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షల్లో గందరగోళం

Intro:Body:

taza

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.