అమరావతి నుంచి రాజధాని మార్చాలనుకుంటే... తిరుపతిలో పెట్టాలని మాజీమంత్రి అమర్నాథరెడ్డి డిమాండ్ చేశారు. రాజధాని మార్పులతో ఇప్పటికే సీమ వాసులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఇప్పుడు మూడు రాజధానులు చేయాలనుకుంటే రాబోయే రోజుల్లో పరిస్థితిని ఊహించలేమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిని చేసేందుకు తిరుపతికి ఏం తక్కువ..? అని ప్రశ్నించారు. అంతర్జాతీయంగా పేరు, ప్రాఖ్యాతలు ఉన్న ప్రాంతం తిరుపతి అని చెప్పుకోచ్చారు.
ఇదీ చదవండి : మందడంలో ఉద్రిక్తత.. పోలీసులు, గ్రామస్థుల మధ్య ఘర్షణ