హెడ్ కానిస్టేబుల్‌పై ముగ్గురు యువకులు విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం నగర పరిధిలో స్పెషల్ బ్రాంచ్- ఎస్బీ హెడ్ కానిస్టేబుల్‌గా కోరుకొండ, సీతానగరం ప్రాంతాల్లో పని చేస్తున్నారు. గురువారం సాయంత్రం ఆనంద్‌నగర్‌లో నాగేశ్వరరావు ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో వెనకనుంచి ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చి ఢీ కొట్టారు. కింద పడిపోయిన కానిస్టేబుల్ లేచి ఆ యువకులను ఫోటోలు తీశారు. దీంతో రెచ్చిపోయిన యువకులు హెడ్ కానిస్టేబుల్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. కింద పడేసి పిడిగుద్దులు కురిపించారు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు ఆపేందుకు ప్రయత్నించినా... ఆగకుండా రెచ్చిపోయి నాగేశ్వరావుపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన హెడ్ కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు. ఓ యువకున్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేశారు. మిగతా ఇద్దరిని పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు సెంట్రల్ జోన్ డీఎస్పీ సంతోష్ తెలిపారు.
ఇదీ చదవండి :
స్టేషన్లో వీరంగం: మహిళా పోలీసుల చేతిని కొరికి.. మెడపై రక్కి...