ETV Bharat / city

రాజధానిని మార్చొద్దంటూ... ముఖ్యమంత్రికి గ్రీటింగ్​ కార్డులు - ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని వార్తలు

రాజధాని విషయంలో రాజమహేంద్రవరం ప్రజలు వినూత్నంగా నిరసన తెలిపారు. అమరావతికి అన్యాయం చేయొద్దంటూ గ్రీటింగ్ కార్డులపై సంతకాలు చేశారు. వీటిని ముఖ్యమంత్రికి పంపనున్నారు.

Greeting cards will be sent to the CM to change his mind
ముఖ్యమంత్రికి గ్రీటింగ్​ కార్డులు
author img

By

Published : Jan 1, 2020, 5:21 PM IST

రాజధానిని మార్చొద్దంటూ... సీఎంకు గ్రీటింగ్​ కార్డులు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ తెదేపా నేతలు రాజమహేంద్రవరంలో సంతకాల సేకరణ చేపట్టారు. పార్టీ స్థానిక కార్యాలయంలో సంతకాల సేకరణను నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యమంత్రి జగన్​ మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతూ నూతన సంవత్సవ శుభాకాంక్షలను తెలిపే కార్డులపై ప్రజలు సంతకాలు చేశారు. అమరావతిపై ప్రజల మద్దతు కోరుతూ సంతకాల సేకరణ చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని తెలిపారు. ఈ కార్డులను ముఖ్యమంత్రికి పంపుతామని అన్నారు.

ఇదీ చదవండి:

అమరావతి కోసం.. భువనేశ్వరి 2 గాజులు విరాళం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.