శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. 2,59,665 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయంలోకి చేరుతున్నాయి. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 866.80 అడుగులకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 129.15 టీఎంసీలు ఉంది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు వదులుతున్నారు. హంద్రీనీవాకు 1,013 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
ఆల్మట్టి జలాశయానికీ వరద కొనసాగుతోంది. ఆల్మట్టి జలాశయానికి ఇన్‌ఫ్లో 2,79,332 క్యూసెక్కులు ఉండగా... 3,20,535 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా...ప్రస్తుతం 96.859 టీఎంసీలు నీటినిల్వ ఉంది.
మరోవైపు.. వరద గోదారి శాంతించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో వరద నెమ్మదిగా తగ్గుతోంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద వరద మరింత తగ్గింది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటిమట్టం 12.1 అడుగులు ఉండగా... సముద్రంలోకి 12.51 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. తూర్పు గోదావరి డెల్టా కాల్వలకు 10,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అటు తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి వరద నెమ్మదిగా తగ్గుతోంది. ప్రస్తుత నీటిమట్టం 42.7 అడుగులుగా ఉంది. అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు.
ఇదీ చదవండి...