ETV Bharat / city

ముంపు బాధితులను రక్షిత ప్రాంతాలకు తరలించండి - godavari floods in ap

ఉభయ గోదావరి జిల్లాల్లోని పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ ఆరాతీశారు. సీఎం కార్యాలయ అధికారులు తాజా పరిస్థితిని జగన్​కు వివరించారు. ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తున్నారు. ముంపు బాధితులను వెంటనే రక్షిత ప్రాంతాలకు తరలించి... అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

ముంపు బాధితులను రక్షిత ప్రాంతాలకు తరలించండి
author img

By

Published : Aug 3, 2019, 8:14 PM IST

రాష్ట్రంలో గోదావరి వరద ఉద్ధృతిపై ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ఆరాతీశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై సమాచారాన్ని సీఎం జగన్ కోరారు. ఇజ్రాయెల్‌ పర్యటనలో ఉన్న జగన్​కు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తాజా పరిస్థితిని వివరించారు. అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు.

ముంపు బాధితులను వెంటనే రక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి భోజనం సహా అన్ని ఏర్పాట్లూ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న ముఖ్యమంత్రి... ముంపు గ్రామాల్లోని ప్రజలకు జాప్యం లేకుండా నిత్యావసర సామగ్రి అందించాలని సూచించారు. ఇప్పటికే ముంపు బాధితులకు 25కేజీల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్, కేజీ కందిపప్పు, లీటరు వంట నూనె, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు పంపిణీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండీ...

కొనసాగుతున్న వరద.. ప్రభావిత గ్రామాల్లో ముంపు బెడద

Intro:ap_gnt_51_18_bhavadeva_radhothsavam_c16పొన్నూరు సాక్షి భవనారాయణ సావి దివ్య రధొతసవం గనంగనిర్వహించారు భకు‌‌‌‌తులు పెది ఎత్తున పాల్గొన్నారు

Body:పటణానికి చెందిన పలువురు వాపారులు భక్తులకు ప్రసాదాలు అందజేశారు

Conclusion:గత 10రోజులుగా సామివారి బమొతసవాలు జరుగుతునాఈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.