నెల్లూరు జిల్లా అనంతసాగరానికి చెందిన షేక్ ఖాజావలికి ప్రాణాంతక బోన్ మ్యారో వ్యాధి సోకింది. సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే అతనికి వైద్యం కోసం రూ.25 లక్షలు అవసరమయ్యాయి. కుటుంబ పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండడం వల్ల ఆ డబ్బు ఆ కుటుంబ సభ్యులకు శక్తికి మించినదే అయ్యింది. అయితే షేక్వలీకి మేమున్నామంటూ అతని స్నేహితులు అండగా నిలిచారు. వైద్యానికయ్యే డబ్బు కోసం ఊరూరా తిరిగి భిక్షాటన చేశారు. ఎవరైనా దాతలు స్పందించి తమ స్నేహితుణ్ని కాపాడాలంటూ అభ్యర్థించారు. చివరికి రూ.26 లక్షలు పోగుచేశారు. తమిళనాడులోని వేలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖాజావలికి ఇంకో రెండురోజుల్లో శస్త్రచికిత్స జరగనుంది. ఈలోపే.. పరిస్థితి విషమించి నిన్న ఖాజావలి చనిపోయాడు. అతని మరణ వార్త విన్న కుటుంబసభ్యులు తల్లడిల్లిపోయారు. తన మిత్రుడు ఇక లేడని తెలిసి స్నేహితులంతా కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇవి కూడా చదవండి: