పచ్చని వాతావరణం... కొండల్ని మూద్దాడే మేఘాలు... జలపాత చప్పుళ్లు... మనం ఉంది భూమి మీదా.. స్వర్గంలోనా... అనే మేమరుపుతో పెంచలకోన అందాలు కట్టిపడేస్తున్నాయి. నెల్లూరుకు 70 కిలోమీటర్లు దూరంలో ఉంది పెంచలకోన. ఇక్కడ కొలువైన లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. చుట్టూ ఎత్తైన కొండలు, ప్రకృతి రమణీయమైన దృశ్యాలు.. పర్యటకుల మది దోచుకుంటున్నాయి. ఇక్కడి జలపాతం చూపరులను కట్టిపడేస్తోంది.
ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించాడానికి.. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి పర్యటకులు తరలివస్తున్నారు. సందర్శకులను ఆకట్టుకునేందుకు పెంచలకోనను... అధికారులు పర్యటకంగా అభివృద్ధి చేస్తున్నారు.
ఇదీ చదవండి