ETV Bharat / city

'వైకాపా బాధితుల తరఫున మేమే పోరాడతాం' - తెదేపా శ్రేణులపై వైకాపా నేతల దాడులు

వైకాపా దాడుల్లో నష్టపోయిన కుటుంబాలను పార్టీ తరఫున ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. నెల్లూరు నగరంలోని ఓ గార్డెన్స్‌లో వైకాపా బాధితులతో చంద్రబాబు సమావేశమయ్యారు. తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయించే పోలీసులపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.

చంద్రబాబు
author img

By

Published : Oct 15, 2019, 5:01 PM IST

Updated : Oct 15, 2019, 5:55 PM IST

చంద్రబాబు

రాష్ట్రంలో అధికార పార్టీ దాడులు అధికమయ్యాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రజాప్రతినిధులు దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. వైకాపా బాధితులకు తాము అన్ని విధాలా అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. నెల్లూరులో రెండోరోజు పర్యటిస్తున్న చంద్రబాబు నగరంలో ఓ గార్డెన్స్​లో వైకాపా, పోలీసుల బాధితులతో సమావేశమయ్యారు. అధికార అండతో దౌర్జన్యాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని... బాధితుల తరపున తామే పోరాడుతామని హామీ ఇచ్చారు.

వైకాపా అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో దాడులు అధికమయ్యాయని, దౌర్జన్యాలు చేసినవారే బాధితులపై కేసులు పెట్టే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలకు వత్తాసుగా పోలీసులు కేసు నమోదు చేయడం దారుణమన్నారు. ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో దాడుల సంస్కృతి తాము ఎన్నడూ చూడలేదన్నారు. దొంగ సారా, బెట్టింగ్ కేసుల్లో ఉన్న ఎమ్మెల్యేలు రౌడీల్లా తయారయ్యారని విమర్శించారు.

ఇదీ చదవండీ... కొండవీడుకోట అందాలు చూద్దం రారండీ!

Intro:Ap_Nlr_02_15_Ycp_Bhadhithulu_Chandrababu_Kiran_Pkg_AP10064

కంట్రీబ్యుటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

నోట్: సార్, కిట్ నెంబర్ 699 నుంచి లైవ్ లో వచ్చిన విజువల్స్, బైట్స్ వాడుకోగలరు.

యాంకర్
రాష్ట్రంలో అధికార పార్టీ దాడులు అధికమయ్యాయి... అడ్డగోలు తెలివితేటలతో వైకాపా ప్రజాప్రతినిధులు దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తిరు వైకాపా బాధితులకు తాము అన్ని విధాలా అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. నెల్లూరులో రెండోరోజు పర్యటిస్తున్న చంద్రబాబు నగరంలో అనిల్ గార్డెన్స్ లో వైకాపా, పోలీస్ అధికారుల బాధితులతో సమావేశమయ్యారు. అధికార అండతో దౌర్జన్యాలు చేస్తే, చూస్తూ ఊరుకోమని, బాధితుల తరపున తామే పోరాడుతామని ప్రకటించారు.
వి.ఓ.-1: మాజీ ముఖ్యమంత్రి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు రెండోరోజు అనిల్ గార్డెన్స్ లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వైకాపా బాధితులతో దాదాపు రెండున్నర గంటల పాటు సమావేశమైన చంద్రబాబు, వారి సమస్యలని తెలుసుకొని అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. వైకాపా అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో దాడులు అధికమయ్యాయని, దౌర్జన్యాలు చేసినవారే బాధితులపై కేసులు పెట్టే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలకు వత్తాసుగా పోలీసులు కేసు నమోదు చేయడం దారుణమన్నారు. ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలను ఈ దాడుల సంస్కృతి తాము ఎన్నడు చూడలేదన్నారు. దొంగ సార, బెట్టింగ్ కేసుల్లో ఉన్న ఎమ్మెల్యేలు రౌడీల్లా తయారయ్యారని విమర్శించారు. రౌడీలకు వత్తాసు పలుకుతూ బాధితులను ఊరువదిలి అంటున్న పోలీసులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలని, ఇలాంటి పోలీస్ అధికారులపై పోలీస్ అసోసియేషన్ ఏం చెబుతుందని ప్రశ్నించారు. జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు, అక్రమ కేసులు బనాయించే పోలీసులను కోర్టు కీడుస్తామన్నారు.
బైట్: నారా చంద్రబాబు నాయుడు తెదేపా అధినేత
వి.ఓ.2: జగన్ చేతనైతే తన నాయకులను కట్టడి చేసుకోవాలని లేకపోతే పార్టీని బంగాళాఖాతంలో కలపాలని చంద్రబాబు అన్నారు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
Last Updated : Oct 15, 2019, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.