నెల్లూరులోని పాత మున్సిపల్ కార్యాలయం రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఆదర్శ పాఠశాల ఇది. అయితే 'పేరు గొప్ప ఊరు దిబ్బ' అన్నట్టుగానే ఉంది దీని పరిస్థితి. బీటలు వారిన గోడలు, ఎప్పుడు ఊడిపడతాయో తెలియని విధంగా ఉన్న పెచ్చులు... ఇలా వీటి మధ్యే చిన్నారులంతా విద్యాభ్యాసం చేస్తున్నారు. 1955లో ఏర్పాటైన ఈ పాఠశాల నానాటికీ శిథిలమవుతూనే ఉంది. పాఠశాల మైదానంలోనే మురుగు ప్రవహిస్తుండటం... విద్యార్థుల ఆరోగ్యానికి సంకటంగా మారింది.
మౌలిక వసతుల కరవుతో పాటు ఉపాధ్యాయుల కొరతా వేధిస్తోందని పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను గుర్తించి ఇప్పటికైనా పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి: