జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష చేపట్టారు. రైతుల కోసం కాకినాడ జేఎన్టీయూ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఉదయం 8 గంటలకు దీక్ష ప్రారంభించారు. వైఎస్ జగన్ ప్రభుత్వానికి రైతుల సమస్యను బలంగా తెలియజేయడానికే దీక్ష తలపెట్టినట్లు పవన్ తెలిపారు. వరి పంట వేయడానికి రైతులు భయపడుతున్నారన్న జనసేనాని... రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని విమర్శించారు. గిట్టుబాటు ధర లేక.. పెట్టిన పెట్టుబడి రాక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, బకాయిలు చెల్లించి మిల్లర్లకు ఇచ్చే ధాన్యానికి రశీదులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్, నాగబాబు కూడా దీక్షలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: