ETV Bharat / city

దాడులు చేసి... తిరిగి బాధితులపైనే కేసులా..?

రాష్టాన్ని అభివృద్ధి చేయాలనే తపనలో పార్టీపై సరిగా దృష్టి పెట్టలేదని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఒకరిద్దరు నేతలు వెళ్లినా పార్టీ ఎప్పుడూ బలహీనపడదని స్పష్టం చేశారు. కార్యకర్తల్లో కసి చూస్తుంటే ఇన్నేళ్లూ ఏం కోల్పోయామో తెలిసిందని ఉద్వేగంగా మాట్లాడారు. ప్రభుత్వాన్ని నెంబర్-1 చేసిన తనకు... పార్టీని నెంబర్-1 చేయడం పెద్దకష్టం కాదని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఒక నగరం నుంచి మరో నగరానికి విమానంలో వెళ్లే పరిస్థితి లేదన్న చంద్రబాబు... అమరావతి నుంచి విశాఖ, తిరుపతి వెళ్లాలంటే హైదరాబాద్ వెళ్లి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు
author img

By

Published : Sep 6, 2019, 8:58 PM IST

పులివెందుల పంచాయతీని జగన్‌ రాష్ట్రమంతా విస్తరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తెదేపాకు ఉన్న క్యాడర్ ఏ పార్టీకీ లేదన్న చంద్రబాబు... వైకాపాకు అసలు క్యాడరే లేదని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లు తప్ప వైకాపాకు శ్రేణులు లేరని విమర్శించారు. తమ కార్యకర్తలపై దాడులు చేసి తిరిగి బాధితులపైనే కేసులా..? అని ప్రశ్నించారు. ఇదేమి రాజ్యం అని ప్రశ్నిస్తుంటేనే కేసులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు

పోలీసులు దిగజారుతున్నారు...

పోలీసుల్లో ఇంత దిగజారుడుతనం గతంలో ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఐపీఎస్‌ అధికారులే ఇలా వ్యవహరిస్తే ఎలా..? అని ప్రశ్నించారు. గ్రామాల్లో నివసించే హక్కు కోసమే చలో ఆత్మకూరు కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు భద్రతతో ఆడుకుంటున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరానికి ఏమైనా జరిగితే గోదావరి జిల్లాలు ఏమవుతాయని ప్రశ్నించారు. ఈ వందరోజుల పాలన రాష్ట్రానికి ఓ శాపమని అభిప్రాయపడ్డారు. తీవ్రవాద ప్రభుత్వమని పారిశ్రామికవేత్తలు అనేలా చేశారని విమర్శించారు.

క్యాడర్‌ను గౌరవించుకుంటున్నాం...

తమ పార్టీ ఎప్పుడూ క్యాడర్‌ను గౌరవిస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. కార్యకర్తల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకున్నామన్న చంద్రబాబు... దేశంలో తొలిసారి బీమా సౌకర్యం తీసుకొచ్చిన పార్టీ తమదేనని స్పష్టం చేశారు. రాజకీయ కక్షల బాధితుల కోసం పునరావాస నిధి ఏర్పాటు చేశామని వివరించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి రాక్షస పాలన ఎప్పుడూ చూడలేదని ధ్వజమెత్తారు. ఫ్యాక్షన్ రాజకీయాల జిల్లాల నుంచి వచ్చినవాళ్లు కూడా ఇలా ప్రవర్తించలేదన్నారు. కక్షపూరిత రాజకీయాలకు జగన్ తొలిసారి శ్రీకారం చుట్టారని ఆరోపించారు.

జగన్‌ ఇవాళ కూడా కోర్టుకు వెళ్లే పరిస్థితి...

గతంలో ఎంతోమంది నేతలతో పోరాటం చేశామన్న తెదేపా అధినేత... ఇలాంటి విధ్వంసకర రాజకీయాలు గతంలో ఎప్పుడూ లేవని పేర్కొన్నారు. అవకాశం కలిసివచ్చి వైకాపా అధికారంలోకి వచ్చిందని చెప్పారు. రాజకీయాల్లో గౌరవం ఉండాలని ఆకాంక్షించామన్న చంద్రబాబు... జగన్‌ ఇవాళ కూడా కోర్టుకు వెళ్లే పరిస్థితి ఉందని విమర్శలు గుప్పించారు. తనపై వ్యక్తిగత కక్ష తీర్చుకునే స్థాయికి దిగజారారని ఆరోపించారు. తనకు రక్షణగా పోలీసులను పంపకుండా నీచమైన రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. శాసనసభలో తనకు మైకు ఇవ్వడం లేదన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు

ప్రజలను రెచ్చగొడుతున్నారు...

తూర్పుగోదావరి జిల్లాలో తమ వాళ్లపై 21 కేసులు పెట్టారని చంద్రబాబు తెలిపారు. గోదావరి, శ్రీకాకుళం జిల్లాల ప్రజలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారన్న చంద్రబాబు... ప్రశాంతంగా బతికే ప్రజలనూ రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు అత్యుత్సాహం పనికిరాదని ఆక్షేపించారు. తెదేపా కార్యకర్తలపై కేసులు పెట్టి భయపెడుతున్నారని ఆరోపించారు. ప్రతీకారం తీర్చుకునేందుకా ప్రజలు మీకు ఓటు వేసిందని ప్రశ్నించారు. మీ అధికారం శాశ్వతం కాదని... అమరావతి శాశ్వతమని పేర్కొన్నారు. రాష్ట్రానికి గొప్ప రాజధాని నగరం వద్దా అని నిలదీశారు.

ఇదీ చదవండీ... ఏ పని కావాలన్నా 72 గంటల్లోనే చేస్తాం

Intro:ap_knl_21_06_ganesh_nimajjanam_av_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాలలో వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. నంద్యాల సమీపంలో చిన్న చెరువు వినాయక వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వినాయకుడి నిమజ్జనం చేశారు. నంద్యాల ఎంపీ. పోచా బ్రహ్మానంద రెడ్డి , ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, ఆర్డీవో రామకృష్ణా రెడ్డి, డిఎస్పీ చిదానందరెడ్డి, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు. సాయంత్రం నుంచి నిమజ్జన కార్యక్రమం ఊపందుకుంటుంది. నంద్యాలలో 300 విగ్రహాలకు పైగా నిమజ్జనం కావాలి. శనివారం తెల్లవారుజాము వరకు నిమజ్జన కార్యక్రమం కొనసాగనుంది. నిమజ్జనం సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు

Body:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.