తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో ఏడేళ్ల బాలిక అపహరణ కలకలం రేపుతోంది. దీప్తిశ్రీ ఇసాని జగన్నాథపురంలోని నేతాజీ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ఈ పాప తల్లి మూడేళ్ల క్రితం చనిపోగా... తండ్రి సూరాడ సత్యశ్యాంప్రసాద్ కుమార్ మరో వివాహం చేసుకున్నారు. భార్య శాంతికుమారి, కుమారుడుతో కలసి సంజయ్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. దీప్తిశ్రీ తూరంగి పగడాలపేటలో మేనత్త వద్ద ఉంటోంది.
రోజూ మాదిరిగానే శుక్రవారం పాఠశాలకు వెళ్లిన దీప్తిశ్రీ... మధ్యాహ్న భోజన అనంతరం బడి ఆవరణలో ఆడుకుంటుంంది. అప్పుడు... దీప్తిశ్రీని గుర్తుతెలియని మహిళ, మరోవ్యక్తి అపహరించినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై బాలిక తండ్రి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సవతి తల్లి శాంతికుమారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే... సవతి తల్లి శాంతికుమారే... తన మనవరాలు దీప్తిశ్రీని చంపేసిందని... పాప నానమ్మ బేబి ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం నగరంలో సంచలనంగా మారింది.
ఇదీ చదవండి