చిన్నారులపై అత్యాచారాల నిరోధానికి గ్రామ గ్రామాన ప్రచారం చేస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. గుంటూరులో అత్యాచారయత్నానికి గురై, సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న నాలుగేళ్ల బాలికను ఆమె పరామర్శించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు, బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
నిరసన సెగ....
మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ఆస్పత్రి నుంచి బయటకు రాగానే బాలిక బంధువులు, రాజకీయ, ప్రజా సంఘాల ప్రతినిధులు ఆమె కారును అడ్డుకున్నారు. ఘటనను ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందని ఆరోపించిన వారు... దిశ చట్టం కింద నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చివరకు పోలీసుల సాయంతో అక్కడి నుంచి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పద్మ బయటపడ్డారు. తెదేపా నేతలు డొక్కా మాణిక్య వరప్రసాద్, నన్నపనేని రాజకుమారి, శోభారాణి... బాధిత బాలికను పరామర్శించారు. ఘటనపై ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: