దిశ బిల్లును శాసనసభలో ఆమోదించిన రోజే గుంటూరులో దారుణం వెలుగుచూసిందని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల బాలికపై మృగాడు లక్ష్మణ్ రెడ్డి అత్యాచారానికి పాల్పడిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆందోళన చెందారు. ఒక పక్క చట్టాలు పదునెక్కుతున్నా... రోజూ జరుగుతున్న ఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నాయన్నారు. మహిళలు బయటకు వెళ్ళాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉందని లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. కొత్త చట్టం ప్రకారం ముఖ్యమంత్రి జగన్… నిందితుడికి 21 రోజుల్లోనే శిక్ష పడేలా చేసి బాధిత కుటుంబానికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు
![lokesh on rape in andhra pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5369653_loki2.jpg)
![lokesh on rape in andhra pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5369653_loki.jpg)
ఇదీ చదవండి