గుంటూరు అర్బన్ పరిధిలో గంజాయి రవాణాపై పోలీసులు విస్తృత దాడులు చేశారు. తాడేపల్లి, కొత్తపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు కేసుల్లో 8 మంది గంజాయి విక్రేతలను అరెస్టు చేశారు. కొత్తపేటలో ముగ్గుర్ని అరెస్టు చేసి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లిలో ఐదుగురిని అరెస్టు చేసి 10 కిలోల గంజాయి, లక్షా 42 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 5 నెలల్లో 31 కేసుల్లో 95 మందిని అరెస్టు చేశామని అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. కొన్ని మందుల దుకాణాల్లో మత్తును కల్గించే మాత్రలు విక్రయిస్తున్నారని... వాటిపైనా దాడులు చేస్తామన్నారు.
ఇదీ చదవండి