దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ దిగజారిపోతోందని... ఆటోమొబైల్ రంగం తీవ్రంగా పతనమైందని గుంటూరులో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయం వ్యక్తం చేశారు. 8 ముఖ్య రంగాల్లో ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి 0.5 శాతం మాత్రమేనని మూడు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని వెల్లడించారు. రైల్వేలో క్రమంగా ప్రైవేటీకరణ పెంచుతున్నారని ఆయన తెలిపారు. భాజపా ప్రభుత్వం తీరుతో దేశంలో పేదరికం ఇంకా విస్తరిస్తోందని ఆరోపించారు. చర్చకు అవకాశం లేకుండానే పార్లమెంటులో 26 బిల్లులు ఆమోదించారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం తీరుపై సీపీఎం తరఫున మరో స్వాతంత్య్ర పోరాటం చేస్తామని సీతారాం అన్నారు. మిగతా వామపక్షాలతో కలిపి ఈ పోరాటం సాగించనున్నట్లు ఆయన తెలిపారు.
అమర్‌నాథ్ యాత్ర నిలపడం సరికాదు..
అమర్‌నాథ్ యాత్రను ఆకస్మికంగా నిలిపివేయడం సరికాదని సీతారాం ఏచూరి అన్నారు. యాత్ర ఎందుకు నిలిపివేశారో పార్లమెంటులో కేంద్రం చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి-321@చినుకు జాడలేని మండలాలు