గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు పీట్ల శ్రీను(47) ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీను... ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. మట్టిపని చేస్తూ జీవనం సాగిస్తున్న శ్రీను... 5 నెలలుగా ఉపాధి లేక అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పెదకాకాని పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి