ETV Bharat / city

'వచ్చే ఏడాది నుంచి పాఠ్యప్రణాళికలో మార్పులు' - పాఠ్యప్రణాళికలో మార్పులు వార్తలు

రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించకపోతే... కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి విద్యార్థులకు పూర్తి ఫీజు రీయంబర్స్​మెంట్ ఇస్తామని సీఎం తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోర్సుల పాఠ్య ప్రణాళిక మార్చబోతున్నట్లు ప్రకటించారు.

'వచ్చే ఏడాది నుంచి పాఠ్యప్రణాళికలో మార్పులు'

author img

By

Published : Nov 28, 2019, 10:57 PM IST

వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోర్సుల పాఠ్యప్రణాళిక మార్చబోతున్నట్లు... ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి నియంత్రణ, పర్యవేక్షణ కమిటీతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య, కమిటీ సభ్యులు, అధికారులు హాజరయ్యారు.

ఉన్నత విద్యామండలి రెగ్యులేటరీ కమిషన్‌తో సీఎం జగన్‌ సమీక్ష

తాము చేపడుతున్న కార్యక్రమాలపై కమిషన్‌ ముఖ్యమంత్రికి ప్రదర్శన ఇచ్చింది. అనంతరం కీలక అంశాలపై సీఎం చర్చించారు. ఈ ఏడాది నుంచే పిల్లలకు పూర్తిస్థాయిలో ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ఇవ్వబోతున్నామని సీఎం పునరుద్ఘాటించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ కాకుండా డిగ్రీ, ఆపై కోర్సులు చదువుతున్న వారికి వసతి, భోజన ఖర్చుల కోసం ఏడాదికి రూ.20వేలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.

ఉద్యోగం, ఉపాధి కల్పించేలా పాఠ్యప్రణాళిక రూపొందించబోతున్నట్లు తెలిపారు. ఏడాది పాటు అదనంగా అప్రెంటీస్​షిప్ ఇవ్వబోతున్నామని... అందువల్ల వీటిని మామూలు డిగ్రీలుగా కాకుండా... ఆనర్స్​ డిగ్రీలుగా పరిగణించాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగాల కోసం విపరీతమైన పోటీ ఉందన్న సీఎం... సరైన ప్రాక్టికల్‌ అనుభవం లేకపోతే పోటీ ప్రపంచంలో నిలవలేరన్నారు.

కళాశాలలకు 6నెలల గడువు...
ఇంజినీరింగ్ కళాశాలల్లో ఉన్న వాస్తవ పరిస్థితులను సీఎంకు కమిటీ సభ్యులు వివరించారు. ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం... అర్హత కల్గిన బోధన సిబ్బంది లేరని తెలిపారు. ప్రయోగశాలల్లో పరికరాలు సరిగ్గా లేవని వివరించారు. చాలా కాలేజీల్లో అడ్మిషన్లు చాలా స్వల్పంగా ఉన్నాయని చెప్పారు. ఇకపై అన్ని కాలేజీలు నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

లంచాలు ఇస్తే సరిపోతుందనే భావన కనిపించకూడదని జగన్ అన్నారు. నిర్దేశించుకున్న ప్రమాణాలను కాలేజీలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి అవసరమైతే 6 నెలల సమయం ఇవ్వాలని తెలిపారు. తర్వాత వాటిపై చర్యలు తప్పనిసరి తీసుకోవాలని... ఈ మేరకు వారికి సందేశం వెళ్లాలన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌ విషయంలో కాలేజీలకు ఎలాంటి బకాయిలు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేసినట్లు సీఎం తెలిపారు.

ఇదీ చదవండి

చంద్రబాబు కాన్వాయ్​పై రాజధానిలో రాళ్ల దాడి

Intro:Body:

AP_VJA_52_28_CM_REVIEW_ON_HIGHER_EDUCATION_REGULATORY_MONITARING_COMMISSION_PKG_3068069

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.