తెలుగుదేశం నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ తనిఖీలు చేస్తోంది. ఉదయం 6.30 నుంచి గుంటూరులోని రాయపాటి నివాసంలో సిబ్బంది సోదాలు చేస్తున్నారు. ఇదే సమయంలో.. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీతోపాటు రాయపాటికి సంబంధం ఉన్న పలు కంపెనీల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో.. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, దిల్లీలో ఈ సోదాలు చేస్తున్నారు.
రుణం ఎగ్గొట్టిన కేసులో..
రాయపాటి సాంబశివరావు ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారు. ఈ సంస్థ.. ఇండియన్ బ్యాంకు నుంచి 500 కోట్ల రూపాయలు రుణం తీసుకుని.. తిరిగి చెల్లించలేదు. బ్యాంకు నుంచి ఫిర్యాదు అందుకున్న సీబీఐ.. కేసు నమోదు చేసింది. ఈ మేరకే విశాఖ నుంచి గుంటూరు వచ్చిన ఆరుగురు సిబ్బంది బృందం సోదాలు చేస్తోంది. తనిఖీల సమయంలో రాయపాటి.. ఇంట్లో లేని కారణంగా ఆయన కుమారుడు రంగబాబుతో సిబ్బంది మాట్లాడారు. విషయాన్ని వివరించి.. సోదాలు చేశారు.