ETV Bharat / city

మాటిచ్చా.. నిలబెట్టుకున్నా.. ఆదుకున్నా: సీఎం జగన్ - latest updates of agri gold case

అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం అందజేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. గుంటూరు కవాతు మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా నిలిచామన్నారు.

AgriGold is a check distribution program for victims by cm jagan at guntoor
author img

By

Published : Nov 7, 2019, 1:49 PM IST

Updated : Nov 7, 2019, 5:19 PM IST

అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదనను అర్థం చేసుకున్నా: సీఎం జగన్

అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం అందజేసే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. గుంటూరు కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం హాజరయ్యారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్... పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులు తనతో వారి బాధలు చెప్పుకొన్నారని గుర్తు చేసుకున్నారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్నాని చెప్పిన జగన్... 3 లక్షల 70 వేల మంది ఖాతాల్లో 265 కోట్ల రూపాయలు వేస్తున్నట్టు చెప్పారు. రూ. 10 వేల లోపు ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన వారికి అండగా ఉంటామని చెప్పారు. ఇచ్చిన మాట నెరవేర్చామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు తొలి మంత్రివర్గ సమావేశంలోని బాధితులకు అనుకూలంగా నిర్ణయంగా తీసుకున్నామన్నారు. కేవలం ఐదు నెలల్లోనే 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్న సీఎం... ఏడాదికి రూ.10వేలు ఇస్తూ ఆటో కార్మికులను ఆదుకుంటున్నామన్నారు.

ఇదీ చదవండి:

ఉత్తమ పాఠశాలలో విద్యార్థులు ఫుల్​... సౌకర్యాలు నిల్​..

Last Updated : Nov 7, 2019, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.