రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాస్థాయిలో 13 అగ్రి ల్యాబ్స్‌తోపాటు 4 ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. విశాఖ, ఏలూరు, గుంటూరు, తిరుపతిలో అగ్రిల్యాబ్ ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను పరీక్ష తర్వాతే రైతులకు సరఫరా చేయాలనీ.. అగ్రిల్యాబ్స్‌లో ముందస్తు పరీక్షల తర్వాతే విక్రయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవీ చదవండి..