3 రాజధానుల ప్రతిపాదనను అంతా స్వాగతిస్తున్నారు: రోజా
ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను అంతా స్వాగతిస్తున్నారని.. వైకాపా ఎమ్మెల్యే రోజా అన్నారు. తెలుగుదేశం నాయకులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని శాసనసభలో చెప్పారు. పాలనను వికేంద్రీకరించకుండా.. అభివృద్ధిని ఎలా వికేంద్రీకరస్తారో చెప్పాలని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోపే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రభుత్వం జగన్ దేనని ఆమె అన్నారు.